Sunday, June 28, 2026
E-PAPER
Homeసోపతి'లాంతరు గ్లాసు' వెలుగులో...

‘లాంతరు గ్లాసు’ వెలుగులో…

- Advertisement -

మరే కారణమూ లేకుండా, కేవలం కవిత్వమే ఇద్దరిని కలిపింది అంటే, ఆ కలయకలో ఉన్న స్వచ్ఛత, ఆత్మీయత మరే కలయకలోనూ దొరకదు అని అనుకుంటాను. వాళ్ళు వేసే ప్రతి అడుగు కవితే, వాళ్ళ మధ్య జరిగే ప్రతి సంభాషణా కవిత్వమే అవుతుంది. అటువంటి అనభూతినే ‘చిత్తలూరి’ పరిచయంలో పొందాను. ఎక్కడో తెలంగాణలో పుట్టిన ఆయన, ఉత్తరాంధ్రా శ్రీకాకుళం మారు మూల పల్లెలో పుట్టిన నేను, ఒకరినొకరం కలుసుకోవడనాకి కారణం కేవలం కవిత్వమే! నేను కాలేజీ చదివే రోజుల్లోనే మేగజైన్లలో వచ్చే కవిత్వాన్ని చదివి, మనసుకు హత్తుకున్న కవిత్వాన్ని దాచుకునే వాడిని. అందులో ‘చిత్తలూరి కవితలూ’ ఉండడం విశేషం. పాతికేళ్ళ క్రితమే ఆయన కవిత్వాన్ని చదివి ప్రేరణ పొందిన వాడిని. ఆయన్ను, నన్ను ఏదోవొక రోజు కవిత్వం కలుపుతుందని ఆనాడు ఊహించ లేదు.

చిత్తలూరి హైకూలు రాయడంలో స్పెషలిష్ట్‌. ఆయన తెలంగాణ నుంచి ఆంగ్లంలో హైకూ బుక్‌ ప్రచురించిన మొదటి వ్యక్తి అని తెలిసినప్పుడు పెద్దగా ఆశ్చర్యపడలేదు.వృత్తి పరంగా ఆంగ్ల బోధకుడు. తెలుగులో మంచి కవి. ఈ రెండూ కలగలిసిన ఆంగ్ల హైకూ పుస్తకమే ఆయన ‘స్కిప్పింగ్‌ స్టోన్స్‌’. డోంట్‌ స్కిప్‌ ఇట్‌ ఇఫ్‌ యు లవ్‌ పొయిట్రీ. చాలా అద్భుతమైన పుస్తకమది. ఈ కవి ఎంతగా మనల్ని ఆలోచనలలో పడేస్తాడో చెప్పడానికి ఆయన రాసిన ఎక్కువ వాక్యాలేవీ చదవవలసిన అవసరంలేదు. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి రెండు మెతుకులు చాలు.”పాత సైకిల్‌/ ఉల్లి గడ్డలకేసేటప్పుడు, /కళ్ళలోంచి నీల్లొచ్చాయి”. ”పుస్తకాల సంచి పడేయకు,/ చిత్తు కాగితాల సంచి/ చేతికొస్తుంది” అంటాడు ఈ గురు కవి.

”నరికిన చెట్టు/ నీడను పాడె కట్టి/ మోసుకెళుతున్నారు” అంటాడీ ప్రకృతి కవి. ఒకటేమిటి? ఈ కవి కనిపించే ప్రతి వస్తువు మీద, వ్యక్తి మీద, వ్యక్తిత్వం మీద కవిత్వం రాస్తాడు. నాలుగు నిమిషాలు మాట్లాడితే, నీ మీద రాస్తాడు. నా మీద రాస్తాడు. ఆయన ఆలోచనలు కవిత్వ సహచరులు. నిత్యం కవిత్వంతోనే తిరుగుతాయి. ఇన్నేళ్ళుగా నిత్యం కవిత్వ సాహచర్యంలోనే బ్రతకడం చాలా అదష్టం. గొప్ప విషయం. ”కవిత్వం చదవకుండా/ ఎలా బ్రతికేస్తున్నారోనని/ ఆశ్చర్యంగా ఉందంటారు”. కవిత్వం అంటే ఆయన జీవితమని ఈ ఒక్క వాక్యమే చెబుతుంది కదా. ఇంతకీ వాళ్ళ ఊరి బడికి/ తెలిసిందో లేదో/ తను కవి అయ్యాడని/ ఇదీ ఆయన కలం లోంచి వచ్చిన అద్భుతమైన కవిత్వ వాక్యం!!! ఇంతటి అద్భుతమైన కవి పరిచయం కలగడం, ఆయన పుస్తకం ఈ ‘లాంతరు గ్లాసు’ వెలుగులో ఆయన గూర్చి పంచుకునే అవకాశం రావడం, నా కవిత్వానికీ ఆయన హదయంలో చిన్న స్థానం దొరకడంగా భావిస్తూ, ‘చిత్తలూరి’ వారి ఈ ‘లాంతరు గ్లాసు’ వెలుగులో… జీవితంలో కోల్పోతున్న ఎన్నిటినో… చదివిన ప్రతి పాఠకుడూ, తప్పక వెతికి దొరకబుచ్చుకుంటాడు.

తిప్పాన హరి రెడ్డి, 9493832412

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -