Tuesday, July 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా కష్టాలు వీడేనా.?

యూరియా కష్టాలు వీడేనా.?

- Advertisement -

మీ-సేవకు వెళ్లే వరకు ఉంటాయా?
ఆందోళనలో రైతులు
నవతెలంగాణ – మల్హర్ రావు

యూరియా బుకింగ్ కోసం యాప్ వాడరాని,స్మార్ట్ఫోన్ లేని రైతులు సమీపంలో గల మీ-సేవా కేంద్రానికి వెళ్లి బుక్ చేయించుకునే వీలును ప్రభుత్వం కల్పించింది.కానీ దీని ద్వారా ఎంత మాత్రం ఉపయోగం ఉండదని రైతులు వాపోతున్నారు.ఓ సెంటర్కు యూరియా వచ్చిన ఐదు నిమిషాల వ్యవధిలోనే బుకింగ్ పూర్తవుతుందని,మీ-సే వకు వెళ్లేవరకు ఎలా ఉంటుందని వాపోతున్నారు.మండల వ్యాప్తంగా ఈ ఏడాది 22,150 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవు తుతాయని అధి కారులు అంచనా వేశారు.ఇందుకు 300 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని చెబుతున్నారు.కాగామండల కేంద్రంలో ఒక పీఏసీఎస్ కేంద్రంతోపాటు పదికి పైగా ప్రైవేట్ డీలర్లు, నాలుగు గ్రోమోర్ కేంద్రా లున్నాయి.మండల కేంద్రాల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నారు.

ఐదు నిమిషాల వ్యవధిలోనే..
యూరియాను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు ఉదయం 6 గంటలకు,మధ్యాహ్నం 3 గంటలకు యాప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.కాగా ఏదేని గ్రామానికి యూరియా వస్తే ఆ సమాచారాన్ని వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం పోస్టు చేస్తున్నారు. దీంతో స్మార్ట్ఫోన్ ఉండి పరిజ్ఞానం గల రైతులు ఐదు నిమిషాల ముందే ఫోన్లో యాప్ను ఓపెన్ చేసి సిద్ధంగా ఉంటున్నారు.సమయం కాగానే బుక్ చేసుకుంటుండటంతో కేవలం 5 నిమిషాల్లోనే ఆ సెంటర్ కు వచ్చిన యూరియా బస్తాలు బుక్ అవుతున్నాయని వ్యవసాయశాఖ అధికారులే చెబుతున్నారు. అలాంటిది సదరు రైతులు మీసేవా వద్దకు వెళ్లి బుక్ చేసుకునే వరకు ఉంటాయా? అనే సందేహం వ్యక్తం అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -