Tuesday, July 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గడువులోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయండి: ఆర్డిఓ

గడువులోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయండి: ఆర్డిఓ

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల మండలంలో జరుగుతున్న ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పరకాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారమ్‌ల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణలో ఎన్యూమరేషన్ కీలకమైనదని, క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఒ) సేకరించిన వివరాలను ఎటువంటి తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం విధించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆన్‌లైన్ ప్రాసెసింగ్‌లో వేగం పెంచడం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో పరకాల తహసీల్దార్, ఎన్నికల శాఖ సిబ్బంది, బూత్ లెవెల్ అధికారులు, సీనియర్ అసిస్టెంట్ మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -