Friday, July 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్దాకలితో ఇంటర్ విద్యార్థుల చదువులు

అర్దాకలితో ఇంటర్ విద్యార్థుల చదువులు

- Advertisement -

విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా..మొదలుకాని మధ్యాహ్న భోజన పథకం
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మాదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించింది.ఉదయాన్నే కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులు మధ్యాహ్నం ఖాళీ కడుపులతో పాఠాలపై శ్రద్ధ చూపరని భావించిన ప్రభుత్వం ఉదయం అల్పాహారం,మధ్యాహ్న భోజనం అమలు చేయాలని నిర్ణయించింది.దీంతో విద్యార్థులు, పోషకులు హర్షం వ్యక్తం చేశారు.

దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని సంబరపడ్డారు.కానీ విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో తరగతులకు హాజరవుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పాఠాలపై శ్రద్ధచూపలేకపోతున్నామని వాపోతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.అయితే కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసేందుకు కళాశాలల్లో కిచెన్ షెడ్లను చూడాలని ఉన్నతాధికారులు ఆదేశాల జారిచేసినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -