- Advertisement -
నవతెలంగాణ-నవాబు పేట
మండలంలో నిర్వహిస్తున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా శుక్రవారం జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్‌ఓ), రెవెన్యూ అదనపు కలెక్టర్ జె . ఎల్.బి హరిప్రియ నవాబ్‌పేట మండలంలోని కొల్లూర్ గ్రామంలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్ నంబర్లు 1, 2, 3, 5లలో జరుగుతున్న డిజిటైజేషన్ పురోగతిని తనిఖీ చేసారు. ఎస్ . ఐ.ఆర్ ప్రక్రియను పారదర్శకంగా తప్పులు లేకుండా వేగవంతంగా, పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో నవాబ్‌పేట తహసీల్దార్ సురేష్ ,గిర్దావారు రామాంజనేయులు, జూనియర్ అసిస్టెంట్ మణికంఠ, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



