Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలి: ఆర్డీఓ

ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలి: ఆర్డీఓ

- Advertisement -

– సదగోడు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో, ఉప తహసీల్దార్
నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలంలోని సదగోడు గ్రామంలో ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) కార్యక్రమంలో భాగంగా సోమవారం అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, ఉప తహసీల్దార్ రమేష్ సదగోడు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిజిటలైజేషన్ పనులను వేగవంతంగా, నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -