Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్‌వాడీ చిన్నారులకు దుస్తుల పంపిణీ

అంగన్‌వాడీ చిన్నారులకు దుస్తుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో గ్రామ సర్పంచ్ అస్పత్వార్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చిన్నారులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పాల్గొని మాట్లాడుతూ.. గ్రామంలోని గర్భవతులకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం బాలామృతం ప్యాకెట్లు, గుడ్లు, పాలు, పెరుగు , నెయ్యి, తాజా కూరగాయలతో చేసిన వంటకాలు తయారు చేసిన వాటిని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, అంగన్‌వాడీ టీచర్ ప్రేమల సిబ్బంది, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -