Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు ప్రారంభించిన సర్పంచ్

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని కౌలాస్ గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మంగళవారం గ్రామ సర్పంచ్ యెంబరి విద్య చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో శానిటేషన్ పనులను ముమ్మురం చేశామని, వర్షాకాలం దృష్ట్యా గ్రామంలో దోమల బెడద నివారణకు ముందస్తుగా ఫాగీంగ్ చేయించామని చెప్పారు. కులాయిల వద్ద నీరు నిలవకుండా కట్టడి చేశామని తెలిపారు. పొలాలకు వెళ్ళే అంతర్గత రోడ్లకు మరమ్మత్తు చేసి, గుంతలు పూడ్చివేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తో పాటు జిపి కార్యదర్శి, జిపిఓ, జిపి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -