- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని సావర్గావ్ గ్రామానికి చెందిన లబ్ధిదారునికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కును మంగళవారం ఆ గ్రామ సర్పంచ్ కపిల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనారోగ్య బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా బాదిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేయడం జరిగిందన్నారు. చెక్కును అందుకున్న అనంతరం బాదిత కుటుంబం సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కపిల్ తో పాటు ఉప సర్పంచ్, జిపి కార్యదర్శి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



