– వైద్య ఖర్చుల నిమిత్తం రూ.25 వేల ఆర్థిక సహాయం
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆసుపాక గ్రామానికి చెందిన దంతెనపల్లి సాయి కుమార్ కు వైద్య ఖర్చుల నిమిత్తం శనివారం రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేశారు. సాయికుమార్ కుటుంబ సభ్యులు సహాయం కోసం లయన్స్ క్లబ్‌ను ఆశ్రయించగా, క్లబ్ అధ్యక్షుడు లక్కినేని నరేంద్రబాబు, కార్యదర్శి బలుమూరి సూర్యారావు, కోశాధికారి జూపల్లి బ్రహ్మారావు కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా సాయికుమార్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సహాయ కార్యక్రమంలో లయన్ మురళి, మహిపాల్ నాయక్, కోటగిరి సీతారామస్వామి, సంక ప్రసాద్‌రావు, జూపల్లి రమణారావు తదితరులు పాల్గొని తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించిన లయన్స్ క్లబ్ సభ్యులందరికీ సాయికుమార్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.



