Sunday, July 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలితో మునుగోడు వెనుకబడింది  

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలితో మునుగోడు వెనుకబడింది  

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  
నవతెలంగాణ – చండూరు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలితో మునుగోడు ప్రాంతం అభివృద్ధి లేక వెనుకబడిందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఆది వారం స్థానిక  రాజశ్రీ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన పనితీరుపై రైతులకు న్యాయం జరగడం లేదని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డిండి నీటి పంపకాల్లో మునుగోడుకు రావాల్సిన నీటిని 440 అడుగుల వద్ద రెగ్యులేటర్ పెట్టి 436 అడుగుల వద్ద మోటర్లు బిగించి మహబూబ్నగర్కు నీళ్లు తీసుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగంగా మునుగోడు నియోజకవర్గం ఎడారి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ కూర్చోవడం తప్ప ఏం చేస్తున్నావని రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు.436 అడుగుల వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో నీటి పంపకాల్లో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మునుగోడు రైతుల అవసరాలకు కేటాయించిన నీటి వాటాను సరిగా అమలు చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మౌనం వహిస్తున్నారని, దీనివల్ల మునుగోడు భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ అమలు నెమ్మదిగా సాగుతోందని ఆయన ఆరోపించారు. ఏదుల నుంచి డిండి ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వద్దని సీఎం రేవంత్ రెడ్డికి మహబూబ్నగర్ కు చెందిన ఎమ్మెల్యేలు లేక ఇచ్చి ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. కానీ ఇక్కడ ఉన్న  ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దీనిని అడ్డుకోవాల్సింది పోయి  ఎక్కడెక్కడో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తంకుమార్ రెడ్డిని కలిసి మాట్లాడాలని ఉత్త మాటలు చెబుతున్న రాజగోపాల్ రెడ్డి ఇకనైనా మీ ఉత్త  మాటలు కట్టిపెట్టి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి డిండి  ప్రాజెక్టు నుండి నీళ్లు తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని అన్నారు.

మునుగోడు అభివృద్ధికి నిధులు తేవలసింది పోయి ఇక్కడ ఉన్న నిజమైన కార్యకర్తలు పట్టించుకోకుండా ఎక్కడో నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గం వెళ్లి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను ఈ నియోజకవర్గాలలో పట్టించుకోవడంలేదని అరుస్తున్నాడని అన్నారు. ముందు నీ ఇల్లు సక్కపెట్టుకొని   ఇతరులను అనాలి అని హితావు పలికాడు.  ఎంతసేపు ఆయన స్వ లాభం కోసం ఏదో కావాలని తన ఉనికి కోసం సోషల్ మీడియాలో వార్తలు నిలవాలని ఆర్భాటం ప్రచారం తప్ప మునుగోడు నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో 

మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొత్త పార్టీ సతీష్,  రాష్ట్ర నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు, మండల ఆధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, యువజన అధ్యక్షులు ఉజ్జిని అనిల్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దగోని వెంకన్న గౌడ్, టిఆర్ఎస్ నాయకులు తేలు కుంట చంద్రశేఖర్, సామ యాదవ రెడ్డి,   నకరికంటి రామలింగం,మహమ్మద్ గౌస్, ఇదికూడా శ్రీను, రాపోలు జగదీష్, జుర్రిగల్ల వెంకన్న, తాందారీ రవి, ఇడికూడా నాగరాజు, సంఘీపు సువర్ణ, నందికొండ నరసింహారెడ్డి, చొప్పరి దశరథ,ఇరిగి రామన్న,  నారపాక శంకర్,అన్నిపాక ధనయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -