Sunday, July 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్నూరు కాపు పట్టణ కమిటీ ఏకగ్రీవం

మున్నూరు కాపు పట్టణ కమిటీ ఏకగ్రీవం

- Advertisement -

పట్టణ మున్నూరు కాపు సంఘం సభ్యులు 
నవతెలంగాణ-నెల్లికుదురు 

నెల్లికుదురు పట్టణ మున్నూరు కాపు సంఘం కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు పులి రామచంద్రు ప్రధాన కార్యదర్శి నల్ల కేశవులు తెలిపారు. ఆదివారం ఆ సంఘం మండల కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లికుదురు పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా పులి రామచంద్రు, ఉపాధ్యక్షులుగా మద్ది కృష్ణమూర్తి, ఆకుల నాగయ్య, ప్రధాన కార్యదర్శిగా, నల్ల కేశవులు సంయుక్త కార్యదర్శిగా బిట్ల సుమన్, కోశాధికారిగా, నరెడ్ల ప్రవీణ్  కార్యవర్గ సభ్యులుగా బొల్లం వెంకన్న, శేరు మురళి, బొమ్మరాతి వెంకన్న, కడారి కృష్ణమూర్తి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధి కోసం సగం సద్దుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -