• 160 మందికి వైద్య సేవలు
నవతెలంగాణ -పెద్దవంగర
మండలంలోని చిట్యాల గ్రామంలో బాల వికాస్ సంస్థ ఆధ్వర్యంలో, తొర్రూరు మెడికేర్ హాస్పిటల్ సహకారంతో ఆదివారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 160 మందికి బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్ కోట నరేష్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. గ్రామ సర్పంచ్ ఈదురు బుచ్చమ్మ బాల వికాస్ సంస్థ సేవలను అభినందించారు. సెంటర్ మేనేజర్ వై. రమా ప్రతి ఏడాది ఇలాంటి శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు రాము, కీర్తి, శిరీష, యాకయ్య, అజయ్ ఆప్టికల్స్ సిబ్బంది, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాల వికాస్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



