Sunday, July 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యా వ్యవస్థకు గురువులే మూలస్థంభాలు

విద్యా వ్యవస్థకు గురువులే మూలస్థంభాలు

- Advertisement -

• ఉపాధ్యాయుడు ఐలయ్య సేవలు ఆదర్శప్రాయం 
• పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి 
నవతెలంగాణ – పెద్దవంగర 
విద్యా వ్యవస్థకు గురువులే మూలస్థంభాలని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో నిర్వహించిన ఉపాధ్యాయుడు సోమారపు ఐలయ్య పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దశాబ్దాల పాటు విద్యారంగానికి అంకితభావంతో సేవలందించిన ఐలయ్య సేవలు ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే కొనియాడారు. వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసిన గొప్ప గురువుగా ఆయన నిలిచారన్నారు.

ఉద్యోగ విరమణ అనేది సేవలకు ముగింపు కాదని, సమాజానికి మరింత సేవ చేసే అవకాశం అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి విజయం వెనుక ఒక ఉపాధ్యాయుడి కృషి ఉంటుందని, గురువుల పట్ల గౌరవ భావాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఆమె సూచించారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఉపాధ్యాయుల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజాకవి జయరాజు మాట్లాడుతూ.. సమాజ సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం అన్నారు. సమసమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

దశాబ్దాల కాలంగా ఐలయ్య- పూలమ్మ దంపతుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్, తొర్రూరు ఎంఈవో బుచ్చయ్య, టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగు మురళి, కుమారస్వామి, బానోత్ గోపాల్ నాయక్, సోమేశ్వర్ రావు, హెచ్ఎం విజయ్ కుమార్, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎర్ర వెంకన్న, రమేష్ కుమార్, మధుసూదన్ రెడ్డి, ఎంఆర్పీఎస్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -