- కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థను పరిష్కరించడానికి,కుల నిర్మూలన సాధించడానికి వర్గ పోరాట దృక్పథం ఒక్కటే మార్గమని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు అన్నారు.ఆదివారం నారాయణఖేడ్ శ్రీనివాస డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కెవిపిఎస్ సంగారెడ్డి జిల్లా స్థాయి సామాజిక ఉద్యమ శిక్షణా తరగతులలో ఆయన కులం వర్గం అనే అంశంపై క్లాస్ బోధించారు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మద్దూరి శివకుమార్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ వర్గ పోరాటం ఒక్కటే సమాజ మార్పుకు చోదక శక్తిగా ఉంటుందన్నారు. ఒక కులాన్ని మరొక కులంతో ఘర్షణ పడితే పీడిత వర్గఐక్యతకు ఆటంకం కలుగుతుందన్నారు. అన్ని కులాల్లోని పీడిత వర్గం ఒకటైతే సమాజం మార్పుకు సంఘటితశక్తి వస్తుందన్నారు కుల సమస్యను కూడా కులంతో పరిష్కరించలేమన్నారు. కుల సమస్యను సైతం వర్గ పోరాట దృక్పథం తోనే పరిష్కరించబడుతుందన్నారు.సమాజంలో పెరుగుతున్న అన్ని రకాల అసమానతలను తొలగించడానికి వర్గ పోరాటం ఒక్కటే ఏకైక ఆయుధమని చెప్పారు.
సామాజిక రంగంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న అణిచివేత కుల పీడనను అంతం చేయడానికి అన్ని కులాలలోని పీడిత వర్గం ఐక్యంగా కుల సమస్యపై వివక్ష అసమాన తలపై సమైక్యంగా ఉద్యమాలు చేపట్టాలన్నారు కుల సమస్య అంటే కేవలం దళితుల సమస్యగా చూడకూడదని అది దేశం సమస్యగా చూడాలని చెప్పారు నేటికీ భూమి చదువు అన్నింటికీ మెజారిటీ ప్రజలుగా ఉన్న శూద్రులు దళితులు దూరం చేయబడ్డారని చెప్పారు హిందువులందరూ బంధువులు అని పేర్కొనబడే ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ్దళ్ సంస్థలు అట్టడుగు వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై ఏ ఒక్కనాడు అయినా నోరు తెరిచారా అని ప్రశ్నించారు. దళితులను గుడిలోకి రానీయకుండా అనేక రూపాల వివక్ష కొనసాగుతుంటే కుల వ్యవక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా ఏనాడైనా సంఘ్ పరివార్ శక్తులు వాటికి వ్యతిరేకంగా కృషి చేశాయా? అని ప్రశ్నించారు.
బీజేపీ 12ఏండ్ల కాలంలో దళితులపై దాడులు దౌర్జన్యాలు 300 రేట్లు పెరిగాయని చెప్పారు ఎన్ సి ఆర్ బి లెక్కల ప్రకారం ఏడాదికి లక్ష ఇరవై వేల దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు దేశ వ్యాప్తంగా నెలకు పదివేల దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పారు బిజెపి అధికారంలోకి వచ్చాక దళితుల బ్రతుకులలో అభద్రత అశాంతి పెరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని నీరుగార్చడానికి కేంద్ర బీజేపీ సర్కార్ నీతి అయోగ్ ద్వారా దళితులకు బడ్జెట్ దక్కనీయకుండా చేసిందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి కుట్రలు చేయడమే కాకుండా విబిజి రాంజీ బిల్లు అమలు చేయడం ద్వారా కోట్లాదిమంది దళితుల నోటికాడ బుక్క లాక్కుందని చెప్పారు.
ఇటీవల దేశవ్యాప్తంగా విద్యార్థి యువతరం నియంత మనువాద పాలనకు వ్యతిరేకంగా సాగించిన సమరం దేశంలో విద్యార్థి యువతరం అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. నియంత ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరిగిన పోరాటానికి తలవంచక తప్పలేదన్నారు. విద్యార్థి ఉద్యమాన్ని అనేక రకాలుగా అప్రతిష్టపాలు చేయడం అబద్ధాలు అసత్యాల ద్వారా పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించినప్పటికీ మొక్కవోని దీక్షతో కేంద్రం మెడలు వంచేంతవరకు సాగించిన పోరాటం ఈ తరం చేసిన మరో స్వాతంత్ర పోరాటం అని అభివర్ణించారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఇది విద్యార్థి యువతరం విజయంగా పేర్కొన్నారు రాబోయే రోజులలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ని పూర్తిగా రద్దు చేసే వరకు నీటి పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తెచ్చేంత వరకు విద్యార్థి యువజనలు ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల ఇస్తామన్న మాట నీటి మూటగా మారిందని భవిష్యత్తులో ఉద్యోగాల కల్పన కోసం యువతరం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. పల్లెల్లో ప్రశాంతంగా జీవనం సాగించే పేదలలో మత ఘర్షణలు కుల గర్షణలు సృష్టించి తమ పబ్బం గడుపుకోవడానికి కొన్ని రాజకీయ శక్తులు కుట్రలు చేస్తాయని, వారి ట్రాప్ లో పడకుండా పేదలు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
కెవిపిఎస్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమెల మాణిక్యం మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో అనేక సామాజిక ఉద్యమాలు నిర్వహించామని చెప్పారు. ఆ పోరాటాల ఫలితంగా నేడు దళితులలో చైతన్యం పెరిగిందన్నారు అగ్రకుల ఆధిపత్యశక్తులను ఎదుర్కొనే ధైర్యం వచ్చిందని చెప్పారు నారాయణఖేడ్ ప్రాంతంలో నేటికీ కులవివక్ష అంటరానితనం కొనసాగుతుందని చెప్పారు కులవివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా బలమైన సామాజిక ఉద్యమాలను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ తరగతులలో కేవీపీ ఎస్ జిల్లా కార్యదర్శి పెద్దాపురం అశోక్ సంఘ నిర్మాణం పనిపద్దతులు కర్తవ్యాలు అనే అంశం పై క్లాసు బోధించారు.ఈ తరగతులలో కేవీపీ ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సుభాష్, కొఠారి నర్సింహులు,గణపతి, మల్లేష్ సంతోష్ కుమార్,కమిటీ సభ్యులు చంద్రశేఖర్, జై కుమార్ అరుణ్, తదితరులు పాల్గొన్నారు.





