- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ.. హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ అనేది గర్భాశయ క్యాన్సర్, ఇతర-సంబంధిత క్యాన్సర్లను నివారించడానికి ఇచ్చే సురక్షితమైన టీకా అన్నారు. ఇది 14 నుండి 15 సంవత్సరాల పిల్లలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



