Wednesday, July 29, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రాష్ట్రంలో విస్తారంగా వర్షం

రాష్ట్రంలో విస్తారంగా వర్షం

- Advertisement -

రాత్రి 11 గంటల వరకు 779 ప్రాంతాల్లో వాన
కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
జుక్కల్‌‌లో 8.95 సెంటీమీటర్ల వాన
నేడూ పలు జిల్లాలకు భారీ వర్ష సూచన


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మంగళవారం ఒకటెండ్రు మినహా అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా వర్షం పడింది. మంగళవారం రాత్రి 11 గంటల వరకు రాష్ట్రంలో 779 రెయిన్‌‌గేజ్‌ ‌సెంటర్ల పరిధిలో వర్షపాతం రికార్డయింది. కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఆ జిల్లాలోని జుక్కల్‌‌లో అత్యధికంగా 8.95 సెంటీమీటర్లు, మహ్మదానగర్‌ ‌మండలం మఖ్దూంపూర్‌‌లో 8.1 సెంటీమీటర్లు, పిట్లం మండల కేంద్రంలో 8 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి, ఆదిలాబాద్‌, జీహెచ్‌ఎంసీ పరిధిలో పలుచోట్ల మోస్తరు వాన పడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ముషీరాబాద్‌‌లో అత్యధికంగా 5 సెంటీమీటర్లు, తార్నాకలో 4.98 సెంటీమీటర్లు, బన్సీలాల్‌‌పేట 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మొత్తంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 183 రెయిన్‌ ‌గేజి సెంటర్ల పరిధిలో వాన పడింది.

బుధవారమూ పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
రాష్ట్రంలో ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన పడే అవకాశముంది. అన్ని జిల్లాల్లోనూ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలున్నాయి. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశముంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -