Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌రేవంత్‌‌ పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు

‌రేవంత్‌‌ పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు

- Advertisement -

ప్రభుత్వం పంతాలకు పోకుండా తీర్పును అమలు చేయాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రేవంత్ రెడ్డి ‌ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బుల్డోజర్ రాజ్యాంగం’పై హైకోర్టు సర్జికల్ స్ట్రైక్ చేసిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రంగనాథ్ తోలుబొమ్మ అయితే, ఆడించేది రేవంత్ రెడ్డి, ఇద్దరూ నేరస్తులేనని అన్నారు. రేవంత్‌‌రెడ్డి పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు అనీ, ఇది నిరంకు శత్వంపై రాజ్యాంగం సాధించిన చారిత్రాత్మక విజయమని చెప్పారు. హైదరా బాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో దాసోజు శ్రవణ్‌ ‌మీడి యాతో మాట్లాడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ముఖ్య మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. నోటీసులు ఇవ్వకుండా, చట్టవిరుద్ధంగా చేపట్టిన కూల్చివేతల వల్ల జరిగిన ప్రయి వేట్, ప్రజల ఆస్తుల నష్టానికి ప్రభుత్వమే పూర్తి నష్టపరిహారం చెల్లిం చాలని కోరారు. న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టినందున హైడ్రా కమి షనర్ ఎవి రంగనాథ్‌‌ను బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలని చెప్పారు. ఈ తీర్పుపై ప్రభుత్వం పంతాలకు పోకుండా, డివిజన్ బెంచ్‌కు గానీ, సుప్రీంకోర్టుకు గానీ అప్పీల్ చేయకుండా హైకోర్టు ఆదేశాలను గౌరవించి మంచి పరిపాలనా సంప్రదాయాన్ని నిలబెట్టాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -