Wednesday, July 29, 2026
E-PAPER
Homeక్రైమ్మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

- Advertisement -


కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలింపు
పోడు భూమిలో మొక్కలు నాటినా
ఫారెస్ట్ అధికారుల తీరుపై గిరిజనుల ఆగ్రహం
నవతెలంగాణ-కామారెడ్డి

పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం షేర్‌శంకర్ తండాకు చెందిన సరోజ అనే గిరిజన ఒంటరి మహిళ సాగు చేస్తున్న రెండెకరాల భూమి ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదై ఉంది. అయినప్పటికీ హక్కు పత్రం ఇంకా అందలేదు. ఈ విషయమై పలుమార్లు జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో)ని కలిసి వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. కాగా, ఆ మహిళా రైతు తన భూమిలో మొక్కజొన్న పంటను సాగుచేసింది. అయితే ఆ భూమిలో మొక్కలు నాటేందుకు గాను ఫారెస్టు అధికారులు మొక్కజొన్న పంటను దున్నేశారు. మంగళవారం మొక్కలు నాటేందుకు రావడంతో.. తన భూమిలో మొక్కలు నాటవద్దని సరోజ వేడుకుంది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగి ఆత్మాహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన గిరిజనులు బాధ్యులైన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని, సరోజకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సరోజకు ఏదైనా అపాయం జరిగితే అందుకు అటవీశాఖ అధికారులే బాధ్యత వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా నాయకులు విట్టల్ నాయక్, గులిబాయి, సరియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -