Tuesday, August 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసారంపల్లి గొప్ప మేధావి

సారంపల్లి గొప్ప మేధావి

- Advertisement -

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, అఖిల భారత రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గొప్ప మేధావని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమానికి తీరని లోటని తెలిపారు. ఆయన మృతికి సంతాపాన్ని ప్రకటించారు. మల్లారెడ్డి అన్ని అంశాలపై పట్టున్న మేధావి అని, ముఖ్యంగా వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై ఆయనకు పూర్తి అవగాహన ఉన్నదని గుర్తు చేశారు. ఆయన నిబద్ధత గల కమ్యూనిస్టు నాయకులని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు తనకు, జూలకంటి రంగారెడ్డికి , ఇతర కమ్యూనిస్టు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆయన సూచనలు, సలహాలు ఎంతగానో ఉపయోగపడేవని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -