Tuesday, August 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గృహజ్యోతి మీటర్లకు మొబైల్‌ తరహా రీచార్జులు.!

గృహజ్యోతి మీటర్లకు మొబైల్‌ తరహా రీచార్జులు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
విద్యుత్ శాఖలో చాలా ఏళ్లుగా స్మార్ట్ మీటర్ల అంశం చర్చానీయంగా మారగా.. తాజాగా వీటి ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చనుంది. ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అనంతరం మొబైల్ ప్రీపెయిడ్ తరహాలోనే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రీచార్జ్ చేయని పక్షం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఆరేళ్ల క్రితం జిడిమెట్లలో అమలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు విదుత్ శాఖ సన్నద్దమవుతుంది. ఇదే అమలైతే స్మార్ట్ మీటర్ల వల్ల గ్రామీణ, పట్టణ ప్రజానీకం కొంత ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అంశం తెరపైకి రాగానే ప్రజానీకం మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. మండలంలో గృహ వినియోగదారులు, వ్యాపారులు, ఇండస్ట్రీయల్ విభాగాలకు సంబంధించి 6,164  విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ కు సంబంధించి 4,870 గృహజ్యోతి పథకం లబ్ధిదారుల కనెక్షన్లు ఉన్నాయి.

భారంగా మీటర్.!
స్మార్ట్ మీటర్లు వినియోగదారులకు మరింత భారం కానున్నాయి. విద్యుత్ శాఖ ఈ భారం భరిస్తుందా..? లేక వినియోగదారులపై మోపుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సింగిల్ ఫేజ్ మీటర్ వ్యయం వినియోగదారుకు రూ.1,300 వరకు ఉండగా, స్మార్ట్ మీటర్ రూ.7వేల వరకు అయ్యే అవకాశం ఉంది. త్రీఫేజ్ మీటర్ కు రూ.10 వేల వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా వినియోగదారులపై భారం మోపిన పక్షంలో జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కానుంది. స్మార్ట్ మీటర్ల ఖర్చును వినియోగదారుడు భరించాల్సి ఉండగా, అందుకు అయ్యే ఖర్చు ఎంత అని నిర్ధారించే దానిపై అధ్యయనాలు జరుగుతున్నాయి. మీటర్ ఖరీదు నిర్ణయించిన అనంతరం బిగించనున్నారు. మొదట ఎస్ పీడీజీ ఎల్ పరిధిలో కొత్త కనెక్షన్ పొందే వినియోగదారులకు అమలు చేయనున్నారు.

మొదట వారికే..
స్మార్ట్ మీటర్లను రెండేళ్ల క్రితం విద్యుత్ శాఖ మొదట ప్రభుత్వ శాఖల్లో అమలు చేయాలని యోచించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో దశల వారీగా ఏర్పాటు పూర్తి చేసిన అనంతరం వినియోగదారుల ఇళ్లకు బిగించాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుతం నూతనంగా విద్యుత్ కనెక్షన్ పొందనున్న వినియోగదారులకు మాత్రమే అమర్చాలని భావిస్తున్నారు. తర్వాత దశల వారీగా కార్యాచరణ రూపొందించి ఎస్పీడీ సీఎల్ పరిధిలోని అన్ని సర్కిల్ పరిధిలో స్మార్ట్ మీటర్లను అముల చేయాలని చూస్తున్నారు. రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -