Tuesday, August 25, 2026
E-PAPER
Homeజాతీయంబౌలర్‌గా వైభవ్‌ సూర్యవంశీ అదుర్స్‌..

బౌలర్‌గా వైభవ్‌ సూర్యవంశీ అదుర్స్‌..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :వైభవ్‌ సూర్యవంశీ అంటే బ్యాట్‌తో విధ్వంసమే గుర్తుకొస్తుంది. కానీ, ఈసారి బంతితోనూ అదరగొట్టాడు. నాలుగు బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. దులీప్‌ ట్రోఫీ అరంగేట్రంలో బంతితో మాత్రం తనలోని కొత్త టాలెంట్‌ను బయటపెట్టాడు. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్‌లో ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు చేసింది. సుదీప్‌ కుమార్‌ ఘరామి 146, షాబాజ్‌ అహ్మద్‌ 167 పరుగులతో రాణించారు. అనంతరం నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే కట్టడి చేసిన ఈస్ట్‌ జోన్‌ ఫాలోఆన్‌ విధించింది.

రెండో ఇన్నింగ్స్‌లోనూ నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ బ్యాటర్లు తడబడ్డారు. 90 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. వైభవ్‌ సూర్యవంశీ తన ఎడమచేతి స్పిన్‌తో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. జట్టు తరఫున అత్యధికంగా 25 పరుగులు చేసిన కిషన్‌ లింగ్‌డో, 4 పరుగులు చేసిన ఇమ్లివాటి లెమ్తూర్‌ను వైభవ్‌ పెవిలియన్‌కు పంపాడు. ఆ రెండు వికెట్లు కూడా అతడికి క్యాచ్‌ల రూపంలో దక్కడం విశేషం. దీంతో వైభవ్‌కు ఒకే ఓవర్లో ‘డబుల్‌ డిలైట్‌’ దక్కిందని బీసీసీఐ సోషల్‌ మీడియాలో ప్రశంసించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -