ఘనంగా 135 వ జయంతి ఉత్సవాలు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రపంచ మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి అంటరానితరాన్ని నిర్మూలించి సమానత్వాన్ని చాటిచెప్పిన గొప్ప సంఘసంస్కర్త మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు యాతకుల రాజన్న మాదిగ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో డాక్టర్ 135 వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ప్రతినిధిగా యాతాకుల రాజన్న మాదిగ హాజరై మాట్లాడుతూ ఈ దేశంలో 5,000 కులాలను ఏర్పాటు చేసి ఒకరిపట్ల ఒకరికి ద్వేషాలు సృష్టించే కొన్ని గ్రంథాలు అధర్మ గ్రంథాలు మనుషుల్ని మనుషులుగా చూడొద్దనే చెడు సంస్కృతి పై అక్షరమనే ఆయుధంతో అనేక పోరాటాలు నడిపి ప్రపంచంలోనే ఏ దేశంలో లేని ఒక రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహనీయుడు బహుముఖ ప్రజ్ఞశాలి అంటరానితనాన్ని అస్పృశ్యతను తొలగించేలా హక్కులు కల్పించిన మహనీయుడు అని కొనియాడారు.
అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ హక్కులను 78 సంవత్సరాలుగా పాలకులు కాలరాస్తున్నారని ఇంకా బడుగు బలహీన వర్గాల స్థితిగతులు మారాలని అందుకు అనుగుణంగా పూలే జగ్జీవన్ రామ్, అంబేద్కర్ లా ఆశయాల సాధనలో మందకృష్ణ మాదిగ ఒక మహత్తర ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారని అన్నారు. ఈ దేశంలో కుల వ్యవస్థను రద్దు చేయాలని భూమిని పంచాలని సంపద అందరికీ సమానంగా పంచాలని 100 ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఒక్కరికి ఉండొద్దు అని అన్నారు.
ఈ దేశ సంపద అంతా మనుషులందరూ సమానంగా పంచుకోవాలని ఇప్పటికే రిజర్వేషన్లు అన్ని కులాలకు అందుతున్నాయని అన్నారు. దళిత క్రిస్టియన్ల పైన ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని ఖండిస్తున్నామని భవిష్యత్తులో కుల వ్యవస్థ రద్దు అనే అంశం పైన పోరాడబోతున్నామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిరి, ఎర్ర వీరస్వామి, బొజ్జ సైదులు మాది, చింత జాన్ విల్సన్, దున్న శ్యామ్, ప్రజా ప్రతినిధులు ప్రస్తుత కౌన్సిలర్లు పట్టణ పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.



