నవతెలంగాణ – కంఠేశ్వర్
నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ నాగ మోహన్ రావు ని బుధవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు కలసి అభినందనలు తెలిపింది.
ఈ సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ పనితీరు గురించి వారికి వివరించారు. ముఖ్యంగా డాక్టర్లు ను నియమించాలని, మందులు చెడిపోకుండా వ్యవస్థను ఏర్పాటు చేయాలని త్రాగునీరు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సూపర్డెంట్ ని కలిసిన వారిలో జిల్లా గౌరవాధ్యక్షులు కే రామ్మోహన్రావు, అధ్యక్షులు శిర్ప హనుమాన్లు, కార్యదర్శి ఈవిల్ నారాయణ, కోశాధికారి లావు వీరయ్య, నిజాంబాద్ అధ్యక్షులు రాధా కిషన్, కార్యదర్శి సాంబశివరావు, నాయకులు పుష్పవల్లి తదితరులు ఉన్నారు.



