- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలానికి చెందిన కారంజీ గోపాల్ (53) కుటుంబ కలహాల కారణంగా పొరుగువాడైన మోతే దత్తు (60)పై ద్వేషం పెంచుకొని, ఈ నెల 14న రాత్రి గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితుడు బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు చేరుకొని నిందితుడిని అడ్డుకున్నారు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బుధవారం ఉదయం 12 గంటల సమయంలో జుక్కల్ బస్ స్టాండ్ వద్ద హైదరాబాద్కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించామని ఎస్సై బి. మురళి తెలిపారు.
- Advertisement -



