- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రమాదకరమని కొయ్యుర్ ఎస్ఐ-2 రాజన్ కుమార్ ప్రజలను హెచ్చరించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని కొయ్యుర్ గ్రామంలో ఆటోడ్రైవర్లకు రోడ్డు భద్రత ,ప్రమాధాలపై, వేసవిలో వడదెబ్బ, గోల్డెన్ ఆఫర్ పై 108 జిల్లా మేనేజర్ రాజు నాయక్ అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడుపొద్దని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పైలెట్ జీవన్ రెడ్డి, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
- Advertisement -



