Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువుల నీటి తొట్టి తొలగింపుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

పశువుల నీటి తొట్టి తొలగింపుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

- Advertisement -

గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు..
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండలంలోని హండే కేలూర్ గ్రామంలో పశువుల నీటి తొట్టి తొలగింపుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు సంబంధిత శాఖల అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పశువులకు దారి తీర్చడమే కాకుండా గ్రామస్తులకు అంతిమ సంస్కరణలో ఈ నీటి తొట్టి ఎంతో ఉపయోగకరంగా ఉండేదని అన్నారు. అలాంటిది అక్రమంగా తొలగించిన దానిపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా తొలగించిన చోటే నీటితొట్టిని నిర్మించాలని కార్యదర్శికి, ఎంపీడీవో, ఎంపీఓ లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ విషయంపై నవతెలంగాణ ఆ గ్రామ కార్యదర్శి విజయ్ షిండే కు ఫోన్ ద్వారా వివరణ కోరగా..తొలగించిన మాట నిజమేనని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -