- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని పలు గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలలో నీటి సమస్యలు తలెత్తకుండా మందస్తుగా మరమ్మత్తులకు ఉన్న పంపుసెట్లను రిపేర్ చేయడం జరిగిందని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నయుం తెలిపారు. ఈ సందర్భంగా మాదాపూర్ గ్రామ సర్పంచ్ ఆశా చందర్ పాటిల్, లొంగన్ సర్పంచ్ నాగలగిద్దే ఉషారాణి సదు పటేల్ , గ్రామంలో నిత్యం కాలిపోవడం వలన నీటి సమస్య ఉన్నందువలన వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఏఈకి సర్పంచులు సమాచారం అందించడంతో వెంటనే గ్రామంలోకి వచ్చి క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించారు. ఎండలు పెరుగుతున్నందువలన వెంటనే స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మరమ్మత్తులు చేసి నీటి సదుపాయం కల్పించడం జరిగింది. గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
- Advertisement -



