Friday, April 17, 2026
E-PAPER
Homeజాతీయంబిల్లు వెనుక అస‌లు ఉద్దేశం వేరు: రాహుల్ గాంధీ

బిల్లు వెనుక అస‌లు ఉద్దేశం వేరు: రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పార్ల‌మెంట్‌లో నారిశక్తి వందన్‌ అధినియం(చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33శాతం రిజ‌ర్వేష‌న్) బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నారిశక్తి వందన్‌ అధినియం పేరుతో కేంద్రం తీసుకవచ్చిన బిల్లు వాస్తవానికి మహిళల రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు కానేకాదని లోక్‌సభ ప్రతిపక్ష నేత అన్నారు. మహిళా బిల్లు చర్చపై ఆయన ఈ రోజు( శుక్రవారం) పార్లమెంటులో మాట్లాడారు. 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని ఇది మహిళలను అడ్డుగా పెట్టి తీసుకొచ్చిన షేమ్ ఫుల్ యాక్ట్ అన్నారు.

ఈ బిల్లు వెనుక ఉన్న అసలు ఉద్దేశం కులగణన లెక్కలు లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నదే అన్నారు. ఓబీసీలకు 15 ఏళ్ల పాటు రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర ఇదన్నారు. బీజేపీ సభ్యులు రాజ్యాంగం కంటే మనువాదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల్లో , న్యాయవ్యవస్థలో ఓబీసీలు గిరిజనులు లేరని, ప్రేవేటు రంగంలో కూడా రంగంలో కూడా ఓబీసీ ఎస్సీ ఎస్టీల ప్రాధాన్యత లేదన్నారు. హిందుత్వం పేరుతో బీజేపీ పార్టీ బీసీ, ఎస్సీ,ఎస్టీలకు చేసిందేమీ లేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -