నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు జయప్రద, మణెమ్మ, ధనలక్ష్మి, అరుణ ఆధ్వర్యంలో శుక్రవారం పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యద్థిగా సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి హాజరై మాట్లాడారు. గర్భధారణ దశ నుంచే తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రక్తహీనత లేకుండా పోషకాహారం తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవచ్చన్నారు. డెలివరీ తరువాత వెంటనే శిశువుకు ముర్రుపాలు ఇవ్వడం ఎంతో ముఖ్యమని, దాని ద్వారా శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు.
పుట్టిన మొదటి నెల నుంచి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను కొనసాగించడం అత్యంత అవసరమని, ఈ కాలాన్ని “గోల్డెన్ డేస్”గా పేర్కొన్నారు. అలాగే రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను భాగంగా చేర్చుకోవాలని, అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. చిన్నారులకు, కిశోర బాలికలకు పౌష్టికాహారం తీసుకునే విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం సర్పంచ్ బండి స్వామి మాట్లాడారు. ప్రభుత్వం అందుస్తున్న పోహకహారాలను లబ్ధిదారులకు సకాలంలో అందజేయాలని, కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు ఇందారపు చెంద్రయ్య, ఆశలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, ఆయాలు పాల్గొన్నారు.



