Friday, April 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాళేశ్వరం ప్రాజెక్ట్‌ మరమ్మతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మరమ్మతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కీలక బ్యారేజీల పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు భారీ కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా పనుల సమన్వయం, పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల, టన్నెలింగ్ నిపుణుడు, రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ పరిక్షిత్ మెహ్రా కన్వీనర్‌గా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమన్వయం చేయడం, నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకురావడం ఈ కమిటీ పని. వారానికి రెండుసార్లు సమావేశమై పురోగతిని ఈ కమిటీ సమీక్షిస్తుంది. ప్రతిరోజూ జరిగే పనులపై రోజువారీ పురోగతి నివేదికలను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మే 30వ తేదీ లోపు కసరత్తు పూర్తి..
వర్షాకాలం ప్రారంభం కాకముందే కీలకమైన పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. బ్యారేజీల పునాదుల పటిష్టతను తెలుసుకోవడానికి మే 30వ తేదీ లోపు జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ , నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు, అనుమతుల మేరకు మాత్రమే ఈ మరమ్మతు పనులు సాగనున్నాయి. ముందుగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి, మేడిగడ్డను పాక్షికంగానైనా వినియోగంలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -