- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో శుక్రవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. టిఎంసి సీనియర్ నేత, రాష్ బెహరి అసెంబ్లీ అభ్యర్థి దేబాసిష్ కుమార్ నివాసంలో, తమిళనాడులోని కరూర్‌లో మాజీ మంత్రి, డిఎంకె కోయంబత్తూర్ సౌత్ అభ్యర్థి వి.సెంథిల్ బాలాజీ అనుచరులకు సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించినట్లు ఐటి అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఐటిని ప్రయోగించిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, పశ్చిమ బెంగాల్ లో రెండు దశల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
- Advertisement -



