Friday, April 17, 2026
E-PAPER
Homeజాతీయంసీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు

సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: నోయిడా కార్మికుల సమ్మెలో నిర్బంధించబడిన నాయకుల కుటుంబాలను, అలాగే దారుణంగా కొట్టబడి, అరెస్టు చేయబడిన కార్మికులను కలిసేందుకు వెళ్లిన సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ నేతృత్వంలోని బృందాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం అడ్డుకుంది. దానిని నిరసిస్తూ నోయిడాలోని సెక్టార్ 27లో ఉన్న గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ ఇంటి ముందు ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ అరుణ్ కుమార్, రాజ్యసభ ఎంపీలు వి.శివదాసన్, ఏఏ రహీం, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్ సక్సేనా, పుష్పేంద్ర త్యాగి నేతృత్వంలోని సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం ధర్నా చేస్తున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం బయట అదుపులోకి తీసుకున్న సీఐటీయూ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి పీవీ అనియన్, అధ్యక్షుడు వీరేంద్ర గౌర్ ఆచూకీ తెలియడం లేదు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -