నవతెలంగాణ – జుక్కల్
రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి 51 శాతం ప్రకటించి వెంటనే అమలు చేయాలని టీజీ ఈ జేఏసీ పిలుపునిచ్చింది. జుక్కల్ మండలంలోని టీజీ ఈ జెఎసి( TGEJAC) పిలుపు మేరకు శుక్రవారం ఎంపీ యుపిఎస్ మహమ్మదాబాద్ (MPUPS, Mohammadabad,) మండల ప్రజా పరిషత్ జుక్కల్ పాఠశాలలో “తెలంగాణ టీచర్స్ యూనియన్ కామారెడ్డి” జిల్లా ప్రధాన కార్యదర్శి కాంబ్లె గోపాల్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి ధరించి నిరసన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. పీఆర్సీ 51% ప్రకటించి వెంటనే అమలుచేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ ను అమలుచేయాలని కోరారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఇన్- సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ ను రద్దుచేయలి.
ఈ హెచ్ ఎస్ సౌకర్యం కల్పించాలి. మిగిలిన 64 అంశాలను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. బసవేశ్వర చౌక్ నుండి ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయం వరకు నినాదాల చేస్తూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, టిటియు మండల అధ్యక్షుడు కాంబ్లె సాయిలు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అదేవిధంగా పిఆర్టియు టీచర్స్ యూనియన్ బాబు సార్ ఆధ్వర్యంలో కూడా జుక్కల్ తాహసిల్దార్ మారుతికి డిమాండ్ తో కూడిన వినతిపత్రం ఉపాధ్యాయ సంఘం వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ, టిటియు జిల్లా, మండల స్థాయి సభ్యులు ఉపాధ్యాయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.



