Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి 

ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
ప్రభుత్వ ఉద్యోగస్తులకు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగస్తుల జేఏసీ నాయకుల పిలుపు మరకు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నర్సింలు మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న పిఆర్సి, డిఏ , జిపిఎఫ్, టీఎస్ జి ఎల్ ఐ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని  తెలిపారు. దశల వారి పోరాట కార్యక్రమంలో భాగంగా 64 డిమాండ్ల పరిష్కరించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కార్యదర్శులు  మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు C. వెంకటయ్య, K. రమేష్  పిఆర్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేందర్ గౌడ్ , B. మల్లయ్య, టీజీ యూఎస్ జిల్లా అధ్యక్షులు థారాసింగ్, మండల  అధ్యక్షులు J. కృష్ణ , టి పి  యుఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్ రెడ్డి , శివ ప్రసాద్ B. రమేష్ గౌడ్ ,హర్యా , మద్దమ్మ , ప్రభావతి, ఝాన్సీ, శ్రీశైలం, శ్రీనివాస్ కృష్ణయ్య ,ఉపాధ్యాయులు రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -