Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థల పరిశీలన, పూజలో పాల్గొన్న నేతలు

స్థల పరిశీలన, పూజలో పాల్గొన్న నేతలు

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల 
ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు శుక్రవారం ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం ప్రవాసీ ప్రజావాణి స్టేట్ కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి గ్రామస్థులతో కలిసి విగ్రహ ప్రతిష్ట కోసం అనుకూల స్థలాన్ని పరిశీలించి, పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాసులు, వార్డు సభ్యులు వెంకటయ్య, లక్ష్మి, పర్వతాలు, అలాగే గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, వెంకట్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, దాసు, శేఖర్ గౌడ్, పానుగంటి పర్వతాలు (పి), శివాజు, పానుగంటి ఆంజనేయులు, కడారి రామచంద్రి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బొజ్జ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ… త్వరలోనే గ్రామ యువకులు, ప్రజల సహకారంతో భూమిపూజ నిర్వహించి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు. అలాగే విగ్రహ ప్రతిష్ట కోసం స్థలం అందజేసిన సంగిరెడ్డి వెంకట్ రెడ్డి, అమరేందర్ రెడ్డి కి, విగ్రహ దాత రాజుకు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -