నవతెలంగాణ-హైదరాబాద్: మోడీ ప్రభుత్వానికి పార్లమెంట్‌లో భంగపాటు ఎదురైంది. లోక్‌సభలో పెట్టిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు (చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్) వీగిపోయింది. మొత్తం 489మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా.. అనుకూలంగా 278 మంది, ప్రతికూలంగా 211 మంది ఓటేశారు. 2\3 మోజార్టీ(326)లేకపోవడంతో సదురు బిల్లు వీగిపోయింది. మహిళ బిల్లుతో పాటు డీలిమిటేషన్ లోక్ సభలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే మహిళ రిజర్వేషన్ బిల్లుకు తామంత మద్దతు ఇస్తామని ప్రతిపక్షాలు ముక్తకంఠం చెప్పాయి. కానీ ఆ బిల్లుతో కలిపి డీలిమిటేషన్ పెట్టడం సరికాదని, డీలిమిటేషన్ పై సమగ్ర చర్చ జరగాలని, జనాభా లెక్కలు నిర్వహించక పార్లమెంట్ పునర్ నియోజకవర్గాల బిల్లును ప్రవేశపెట్టాలని విపక్షాలు కోరాయి. తాజాగా అధికార, ప్రతిపక్షాల సుదీర్ఘ చర్చల అనంతరం సదురు బిల్లులపై ఓటింగ్ నిర్వహించగా మోజార్టీ లేక వీగిపోయింది.
వీగిపోయిన మహిళ రిజర్వేషన్ బిల్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



