Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహసిల్దార్  కార్యాలయం ముందు ఉద్యోగుల నిరసన

తహసిల్దార్  కార్యాలయం ముందు ఉద్యోగుల నిరసన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయిస్  జేఏసీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి డిమాండ్ లను వెంటనే అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మొండి వైఖరి విడి పిఆర్సి, పెండింగ్ బకాయిలు, హెల్త్ కార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ గుడిమేల ప్రసాద్ కు అందజేశారు.ఈ  కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాలు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఐకేపీ , సోషల్  వెల్ఫేర్, వివిధ శాఖల ఉద్యోగులు అందరూ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -