Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

- Advertisement -

– జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవీందర్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవీందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని చౌట్ పల్లి రైతు వేదిక భవనంలో ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఉప వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవీందర్ పాల్గొని గర్భిణీ స్త్రీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మొదలగు వాటిపై వైద్య సిబ్బందితో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల నమోదును ప్రకడ్బందీగా  నిర్వహించాలన్నారు. గర్భిణిగా నమోదైన ప్రతి మహిళను ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకునేలా అవగాహన కల్పించి సిద్ధం చేయాలన్నారు. ఎండలు ముదిరినందున వడదెబ్బ సోకి  సంఖ్య ఎక్కువగా ఉంటుందని తగిన సంఖ్యలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సిబ్బంది అందరూ గృహ సందర్శన సమయంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు.ప్రజలకు వడదెబ్బ వాటిపై అవగాహన కలిగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి  డాక్టర్ స్పందన, ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, పర్యవేక్షకులు స్వరూప, ఆన్ సెంటర్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -