– సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలోకి ఐస్ క్రీమ్ బండ్లు రావద్దని, వాటిని అమ్మొద్దని సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం తీసుకున్న ఈ విషయాలను ఆయన ప్రకటించారు.ఐస్ క్రీమ్ బండ్లవారు ఎవరైనా గ్రామంలోకి వస్తే జరిమానా విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు. గ్రామంలో ఈ విషయమై ప్లెక్సీలు చేయించి పెట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామంలో ప్లాస్టిక్ ను బ్యాన్ చేయడం జరిగిందని, ఎవరు వాడకూడదని తెలిపారు. దుకాణం దారులు, మటన్ దుకాణం వద్ద, టిఫిన్ సెంటరు లలో ప్లాస్టిక్ బ్యాగ్స్ వడవద్దని ఒకవేళ వాడితే గ్రామ పంచాయతీ ద్వారా జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.ఈ విషయాలను గ్రామస్తులు అర్థం చేసుకొని ప్లాస్టిక్ వాడకానికి పూర్తిగా దూరంగా ఉండాలని కోరారు.
గ్రామంలోకి ఐస్ క్రీమ్ బండ్లు రావద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



