Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాల కల్పన

ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాల కల్పన

- Advertisement -

– గ్రీన్ నెట్ టెంట్, కూల్ వాటర్ ఏర్పాటు 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున పని ప్రదేశంలో శుక్రవారం పలు సౌకర్యాలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో పని ప్రదేశంలో కూలీలు దాహాన్ని తీర్చుకునేందుకు  కూల్ వాటర్ తో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. అదేవిధంగా కూలీలు పని విరామ సమయంలో సేద తీరేందుకు నీడకొరకు గ్రీన్ నెట్ టెంట్ ఏర్పాటు చేయించారు. ఉపాధి పని ప్రదేశంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను సర్పంచ్ జమున మహేష్ పరిశీలించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఉపాధి కూలీలు తమ దాహార్తిని తీర్చుకునేందుకు ప్రతిరోజు పని ప్రదేశంలో చల్లని మంచినీటిని ఉంచుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా వేసవి ఎండలు తగ్గేవరకు కూలీలు సేద తీరేందుకు గ్రీన్ నెట్ టెంట్ ను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. ఉపాధి పని ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వార్డ్ సభ్యులు అంకడి శేఖర్, జగడం శ్రీనివాస్, మారంపల్లి లావణ్య శ్రీను, కస్తూరి భారతి పురుషోత్తం. ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, మెట్లు తుటు స్వప్న, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -