Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మక్క రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం 

మక్క రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం 

- Advertisement -

గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు : చిన్న బాల్ రాజ్ 
నవతెలంగాణ – దర్పల్లి
గ్రామస్థాయిలో కాంగ్రేస్ ప్రభుత్వం మక్కలు పండించే రైతులకు ఊరట కల్గిస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని జిల్లా కాంగ్రేస్ పార్టీ ఊఅధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ అన్నారు. శుక్రవారం అయన మండలంలోని దర్పల్లి, మైలారం గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. తాము పండించిన మక్కల కొనుగులు విషయంలో ఇబ్బందులు పారుతున్న రైతు సోదరుల సమస్యను స్పందించి రూరల్ ఎమ్మెల్యే కేంద్రాలను ఏర్పాటుకు కృషి చేసినందుకు అయన రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతులు దళారులకు ఆశ్రయించకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే అమ్మకాలు జరపాలని కోరారు. కార్యక్రమం లో ఆయా గ్రామాల సర్పంచిలు శ్రీనివాస్, మధు, గాదె నరేష్, మాజీ సొసైటీ చేర్మెన్ మల్లికార్జున్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -