నవతెలంగాణ- ఆలేరు టౌను
ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్న, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పై, టిఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తూ, ఆరోపణలు చేస్తే, చూస్తూ ఊరుకోమని, ఆలేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంఏ ఎజాస్ శుక్రవారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు.
రాజపేట మండలం చల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన క్రషర్, 2018 , 19 సంవత్సరంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత హయాంలోనే ఏర్పడిందని, అప్పుడే అనుమతులు ఇచ్చారని, బిఆర్ఎస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి పై విషయం గమనించాలని పేర్కొన్నారు. అగ్రవర్ణాల ఎమ్మెల్యే ఉంటే సక్రమం, బీసీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్రమంగా మారిందా అని ఎద్దేవా చేశారు.
బీసీ బిడ్డ ను, బదనాం చేసేందుకే ఈ నాటకం అని,అన్ని పార్టీలు మారావు, ఎమ్మెల్యేగా, జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడావు, మీ స్థాయికి మరిచి మాట్లాడవద్దని కోరారు. ఆ స్థలం నారాయణరావు అనే వ్యక్తిపై లేఅవుట్ అయ్యిందని బహిరంగ సభలకు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరిమి పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు.



