Friday, April 17, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: టీజీఈ జేఏసీ

పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: టీజీఈ జేఏసీ

- Advertisement -

నవతెలంగాణ – సిర్పూర్ (టి)
తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యచరణ కమిటీ టీజీఈ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం మండల కేంద్రంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ రహీముద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా టీజీఈ జేఏసీ నాయకులు మాట్లాడుతూ పీఆర్‌సీ కమిషన్ రిపోర్ట్‌ను తెప్పించి జూన్ 2లోపు అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని, కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

అలాగే 2004 సంవత్సరం కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలని, మిగిలిన దీర్ఘకాలికంగా ఉన్న 64 అంశాలలో పెండింగ్‌లో ఉన్న వాటిని సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో టీజీఈ జేఏసీ నాయకులు జాదవ్ సుభాష్, మేడి లక్ష్మీనారాయణ, వెంకటరమణ, చిన్న అంకు, సబీనా, పురుషోత్తం, రవికుమార్, రమణ, డి.హరీష్, కె.హరీష్ కుమార్, విద్యాచరణ్, ఉపేందర్, కర్ణాకర్, సాయి, తరుణ్, వంశీ, కార్తీక్, యుగంధర్ మరియు రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -