Friday, April 17, 2026
E-PAPER
Homeఆదిలాబాద్దాహార్తిని తీర్చడానికే చలివేంద్రం ఏర్పాటు

దాహార్తిని తీర్చడానికే చలివేంద్రం ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు జాతర్ల సర్పంచ్ మెస్రం మాధవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని జాతర్ల బజార్ హాత్నూర్ రోడ్డు పై చౌరస్తాలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉందని, ప్రయాణికులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్థిక స్తోమత కలిగిన దాతలు విరివిగా గ్రామాల్లో చలివేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. సేవా కార్యక్రమాలు చేపట్టడంలో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జీవన్, పంచాయతీ కార్యదర్శి నవనీత, గ్రామస్తులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -