Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండో విడత రైతు భరోసా ఎప్పుడో.!

రెండో విడత రైతు భరోసా ఎప్పుడో.!

- Advertisement -

మొదటి విడతలో 9,319 రైతులకు రూ.4.97 కోట్లు జమ
ఎదురుచూపుల్లో రైతాంగం
నవతెలంగాణ – మల్హర్ రావు

యాసంగి సీజన్ కు సంబంధించిన రెండో విడత రైతు భరోసా నిధుల జమపై ప్రభుత్వం నేటికీ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. మొదటి విడతలో ఎకరం భూమి ఉన్న రైతులందరికీ మార్చి 22వ తేదీన రూ.6 వేల చొప్పున ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి రెండో విడత నిధులను జమ చేసి ఈ నెలాఖరు వరకు మూడు విడతలో రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే ఆన్ని ఎకరాలకు నిధులు జమ చేస్తామని ప్రకటించింది. అసలు రెండో విడత రైతు భరోసా నిధులు జమ చేస్తుందో చేయదోనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎకరాకు రూ.12 వేల చొప్పున..
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి వానాకాలం, యాసంగి సీజనక్కు కలిపి రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేసేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పేరుతో ఎకరాకు సంవత్సరానికి రెండు సీజన్లకు కలిపి రూ.12 వేలు చొప్పున జమ చేస్తానని హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున గత యాసంగి సీజన్లో 2025 జనవరి 26న రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి మొదటి విడతలో మండలంలో ఎకరం భూమి ఉన్న 9319 రైతులకు రూ.4.97.84.205 కోట్ల నిధులు వారి ఖాతాల్లో జమ చేసింది.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెండో విడత, మూడో విడత భరోసా నిధులను తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది: శ్రీజ..మండల వ్యవసాయాధికారి
ఈ నెల 13 నుంచే రెండో విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే రైతుల ఖాతాల్లో జమచేస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -