Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూగజీవాలకు నీరు, మేత అందించరా.?

మూగజీవాలకు నీరు, మేత అందించరా.?

- Advertisement -

అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీసిన యజమానులు
నవతెలంగాణ – మల్హర్ రావు

రోజురోజుకూ మండుతున్న ఎండల నేపథ్యంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలోని రుద్రారం గ్రామపంచాయతీ బంజరు దొడ్డిలో తొలిన గెదలకు నీరు, మేత అందించకుండా ఎన్ని గంటలు ఉంచుతారని, దప్పికతో అల్లాడి రెండుమూడు ముగాజీవాలు సొమ్మసిల్లి పోయాయని గెదలు యజమానులు చిగురి సదయ్య, కటుకు పోచయ్య, చిగురు శ్రీనివాస్, పబ్బ శ్రీకాంత్, నగరపు శివాజీ, జాడి రాజమల్లు, చెండ్రు, గట్టు రాకెష్, కమ్మ రాజయ్య, పూజ రమేష్ తదితరులు వాపోయారు.

శుక్రవారం బంజరు దొడ్డి ముందు ఆందోళన చేపట్టి మాట్లాడారు. తమ గెదలు గురువారం ఉదయం 11 గంటలకు బంజరు దొడ్డిలో వేసిన నేపథ్యంలో విడిపించుకోవడానికి జీపీ కార్యాలయం వద్దకు వస్తే పట్టించుకున్న నాథులు కరువైయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకొని రశీదు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి, కారిబార్ ను కోరగా డబ్బులు ఇవ్వండి రశీదులు ఇంకా ప్రిoట్ చేయించలేదు తరువాత ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లుగా వాపోయారు. గెదలు బంజరు దొడ్డిలో పడి దాదాపు 24 గంటలు కావస్తున్నా వాటికి నీరు, మేత వేయలేదని దీంతో రెండు గెదలు సొమ్మసిల్లిపోయినట్లుగా మండిపడ్డారు.

బంజరు దొడ్డి వేలం ప్రక్రియ పూర్తికానిదే పన్ను ఎలా వసూల్ చేస్తారని ప్రశ్నించారు. ఈ సంఘటనపై గ్రామ కార్యదర్శిని నవ తెలంగాణ వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -