- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
కరీంనగర్ పట్టణంలో జుక్కల్ మండలానికి చెందిన పెద్ద ఏడ్గి గ్రామ సర్పంచ్ అస్పత్వర్ అనిల్ ఆధ్వర్యంలో నూతనంగా “వారాహి హోమియోపతి హాస్పిటల్” ప్రారంభమైంది. ఈ ఆసుపత్రిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు మరియు చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం గారు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో హోమియోపతి వైద్యం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఆసుపత్రి ద్వారా ప్రాంతీయ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.
- Advertisement -



