Wednesday, September 16, 2026
E-PAPER
Homeజిల్లాలుశ్రీలత  కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

శ్రీలత  కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు: మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు మృతి చెందడంతో పి ఆర్ టి యు ఇన్సూరెన్స్ ఒక లక్ష రూపాయల చెక్కును ఆమె కుటుంబానికి అందజేసినట్లు పిఆర్టియు మహబూబా జిల్లా అధ్యక్షుడు మిరియాల సతీష్ రెడ్డి నెల్లికుదురు మండలం అధ్యక్షుడు సోమిరెడ్డి యుగంధర్ రెడ్డి తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ పిఆర్టియు సంఘంలో మృతి చెందిన శ్రీలత సభ్యత్వం తీసుకుందని అందులో ఇన్సూరెన్స్ ఉందని అది ఈరోజు ఆమె మృతి చెందిన తర్వాత ఒక లక్ష రూపాయల చెక్కును అందించాలని తెలిపారు. పిఆర్టియు సంఘం పెద్ద సంఘం అని ఆ సంఘంతోనే ఉపాధ్యాయ సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతాయని అన్నారు. ఉపాధ్యాయులకు అండగా ఉండేది పి ఆర్ టి యు సంగమని తెలిపారు. ఆమె మృతి చెందడం ఎంతో బాధాకరమని వారి కుటుంబానికి ఆ సంఘం ఎప్పటికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, సంతోష్, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -