- అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన సర్పంచ్ రామటెంకి శంకర్
నవతెలంగాణ-జన్నారం: జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం గ్రామ పరిధిలో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి సహకరించాలని కోరుతూ మహమ్మదాబాద్ గ్రామ సర్పంచ్ రామటెంకి శంకర్, ఉపసర్పంచ్ సింగం కిష్టయ్యలు జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు.
సాయిని ప్రసాద్ నేత ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామపంచాయతీ భవనం లేకపోవడం వల్ల పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. గ్రామ పరిధిలో అనువైన స్థలాన్ని కేటాయించి నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రామపంచాయతీ భవనం నిర్మాణం పూర్తయితే పాలకవర్గ సమావేశాలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేందుకు, ప్రజలకు అవసరమైన పంచాయతీ సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు హసన్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.



